బాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాల ద్వారా తరచు వార్తల్లో నిలిచే నటీమణుల్లో కంగనా రనౌత్ ఒకరు. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాను రాను ఈమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా కంగనా తన లవ్ బ్రేకప్ గురించి ఇతర విషయాల గురించి కొన్ని విషయాలను వెల్లడించింది.ఆ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎలాంటి సంబంధాలైనా ఎప్పుడూ ఒకే రకంగా ఉండవని ఆమె అన్నారు.. ప్రేమ విషయంలో అందరూ సక్సెస్ సాధించలేరని నేను కూడా తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో పడ్డానని అయితే కొన్ని కారణాల వల్ల మేము విడిపోయామని కంగనా చెప్పుకొచ్చారు. బ్రేకప్ వల్ల నాకు అంతా మంచే జరిగింది. ఒకవేళ ఇప్పటికీ నేను ప్రేమలో ఉన్నట్లయితే ప్రేమ కోసం సమయం కేటాయించాల్సి ఉండేది.. అదృష్టవశాత్తు నాకు బ్రేకప్ జరిగింది అని చెప్పుకొచ్చారు కంగనా
ప్రతి అమ్మాయి పెళ్లి గురించి పిల్లల గురించి ఎన్నో కలలు కంటుంది నేను కూడా అలాగే కలలు కన్నాను అంతేకాకుండా కుటుంబ వ్యవస్థలకు గౌరవం ఇస్తానని కంగనా పేర్కొన్నారు. నేను కూడా పెళ్లి చేసుకోవాలని నాకంటూ ఒక కుటుంబం ఉండాలని నేను చాలా సార్లు అనుకున్నాను రాబోయే ఐదేళ్లలో నేను పెళ్లి చేసుకుంటానని ఆ వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం అయి ఉండాలని కోరుకుంటున్నానని కంగనా తెలిపింది.
కంగనా కెరీర్ విషయానికొస్తే ఆమె రెమ్యూనరేషన్ ఓ రేంజ్ లో ఉంటుంది. రాబోయే రోజుల్లో కంగనా మరిన్ని భారీ ప్రాజెక్టులను ప్రకటించనున్నారని తెలుస్తోంది.పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని చెప్పిన కంగనా మాటలను నిజం చేసుకుంటారో లేదో వెయిట్ చేయాల్సి ఉంది. ఇక కంగనా చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తెలుగులో కూడా అడపా దడపా సినిమాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.