బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందిన హీరోయిన్ ఎవరంటే కచ్చితంగా కంగానా రనౌత్ పేరే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మడు చేసే కామెంట్స్ బాలీవుడ్లో ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.. ఎప్పటికప్పుడు ఇమే చేసే హాట్ కామెంట్లతో హీరోలకు సైతం నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది.ఎవరైనా సరే తన మాటలతో ఉతికి అరెస్తు ఉంటుంది కంగానా రనౌత్.. తెలుగులో ఏక్ నిరంజన్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.
కానీ బాలీవుడ్ లో మాత్రం కెరియర్ పరంగా బాలీవుడ్ క్వీన్ గా పేరు సంపాదించింది.. రీసెంట్గా డ్రగ్స్ విషయంలో కూడా ఈమె పెను సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. బాలీవుడ్లో 99% మంది సెలబ్రిటీలు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు..ఒక స్టార్ హీరో కూడా ఇలాగే డ్రగ్స్ కు బానిస అయ్యారు అంటూ తెలియజేసింది. దీంతో తన భార్య తనని వదిలేసి వెళ్ళిపోయిందని కూడా తెలియజేయడం జరిగింది.. ఆ తర్వాత ఆ హీరోతో నేను డేటింగ్ చేశాను అతనికి డ్రగ్స్ బాగా వాడే అలవాటు ఉందని తెలియజేసింది..
అలాంటి సమయంలో అతని కుటుంబ సభ్యులు తనని బెదిరించాలని దీంతో అతనితో డేటింగ్ చేయడం మానేశానని నాకు తెలిసినంతవరకు బాలీవుడ్ నటీనటులు అందరూ కూడా డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారంటూ తెలియజేసింది కంగానా రనౌత్.. అయితే ఎవరు ఈ విషయాన్ని చెప్పడానికి ధైర్యం చేయలేదు కానీ తనకు అలాంటి భయం లేదని నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇలా తెలియజేశానని తెలియజేస్తోంది.
కంగానా రనౌత్ చేసిన కామెంట్లు పెను సంచలనాలకు దారితీస్తున్నాయి కాకపోతే కంగానా రనౌత్ ఎవరితో డేటింగ్ చేసింది అనే హీరో పేరు మాత్రం తెలుపలేదు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి కంగానా రనౌత్..