కంగనా కారును అడ్డగించిన రైతులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ బ్యూటీ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలు చూస్తూనే ఉంటుంది. తాజాగా పంజాబ్ లోని కిరాక్ పూర్ సాహిబ్ సమీపంలో కళ్యాణ ప్రయాణిస్తున్న కారును రైతులు జెండాలతో అడ్డగించారు. ఆమె కారును ఆపి కారు చుట్టూ పెద్ద రైతులు గుమిగూడి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రైతుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కంగనా కేంద్రం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులను ఉగ్రవాదులతో కోరుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అయితే రైతులు ఆమె కారు చుట్టూ నిరసన తెలుపుతూ చుట్టుముట్టడంతో ఆమెను చంపుతామని బెదిరించారు అంటూ ఆమె తన ఇంస్టాగ్రామ్ వెల్లడించింది. నిరసనకారులు గుంపుగా చుట్టూ చేరే సరికి తనకు ఏం చేయాలో తోచలేదు అని, సమయానికి సెక్యూరిటీ సిబ్బంది కూడా తనతో లేరని, రాజకీయ నాయకుల నీకు కూడా కాదని తెలిపారు. రైతు నిరసనకారులు తనను అడ్డగించడం కంగనా తీవ్రంగా ఖండించారు.

Share.