టాలీవుడ్ ఇండస్ట్రీలో కమలహాసన్ కి ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఆయన సినిమాలకు అభిమానులు ఫిదా అవుతూ ఉంటారు. ఎలాంటి రోల్స్ నైనా అవలీలగా నటించే గుణం ఆయనలో ఉంది. తెలుగులో స్వాతిముత్యం సినిమాలో ఆయన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తరువాత పలు సినిమాలలో అవకాశాలను దక్కించుకొని ఇప్పుడు ఓ రేంజ్ లో ఉన్నారు కమలహాసన్..అయితే కమలహాసన్ కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొ న్నారనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు
అంతేకాకుండా ఒకానొక సమయంలో కమలహాసన్ ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నారట. 21 సంవత్సరం వయసు ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని కమలహాసన్ తెలిపారు. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు మంచి ఆఫర్లు రావడం లేదని తగినంత గుర్తింపు లభించలేదని ఫీల్ కావడంతో ఈ డెసిషన్ తీసుకోవాలనుకున్నాను కానీ నాలాంటి ప్రతిభ ఉన్న కళాకారుడిని కోల్పోయామని సినిమా ఇండస్ట్రీ ఫీలవుతుందని భావించానని అందుకే ఆగిపోయానని తెలిపారు.
అంతేకాకుండా నా గురువు ఆనంద్ కూడా అదే విషయాన్ని చెప్పానని కమలహాసన్ వెల్లడించారు. అయితే ఆ సమయంలో గురువుగారు నీ పని నువ్వు చేసుకుంటూ పో.. గుర్తింపు తానంతట అదే వస్తుంది అని అన్నారట నాకు కూడా ఆత్మహత్య సబబు కాదని అనిపించింది అంటూ కామెంట్స్ చేశారు. చీకటి అనేది మన లైఫ్ లో ఎప్పుడు శాశ్వతంగా ఉండదు. అంటూ కమలహాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. లైఫ్ లోకి కచ్చితంగా వెలుగు వస్తుందని ఆయన అన్నారు. మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేది అసలైన కళ అని కమలహాసన్ కామెంట్స్ చేశారు.
జననం మరణం అనేది మన జీవితంలో ఒక భాగమేనని అలాగే మన జీవితంలో వచ్చే ఒడిదుడుకులు కూడా సహజమేనంటూ ఆ కమలహాసన్ కామెంట్స్ చేశారు ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.