తెలుగు సినీ ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్ గా ఎంతో మంచి గుర్తింపును పేరును సంపాదించుకున్న నటుడు కమలహాసన్..ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. ఇప్పటికీ కూడా పలు సినిమాలలో నటిస్తూ తన కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడిపేస్తున్నాడు. సినిమాలలో బిజీగా ఉంటూనే రాజకీయాల్లో కూడా ఎంతో చురుకుగా పాల్గొంటున్నాడు కమలహాసన్.
ఇది కాస్త పక్కన పెడితే కమలహాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శృతిహాసన్.. ఈమె కూడా మొదట్లో ఎన్నో డిజాస్టర్ లను అందుకొని.. గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించి కెరీర్ పరంగా ఒక మలుపు తిపుకుంది శృతిహాసన్.. ఇప్పటికీ కూడా పలు సినిమాలలో బిజీగా ఉంది శృతిహాసన్. ఒకానొక సమయంలో తన ప్రేమ కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నదట శ్రుతిహాసన్.
ప్రస్తుతం శాంతను హజారికా అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది శృతి అయితే ఈయన కంటే ముందుగా ఓ స్టార్ హీరో ప్రేమలో ఉన్నదట ..ఆ ప్రేమ విషయం ఆ నోట ఈ నోట పాకి కమల్ హాసన్ వరకు చేరిందట..అంతే ఇండస్ట్రీలో ఆయనకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేసి ఇండస్ట్రీ నుంచి తరిమేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. శ్రుతిహాసన్, ఆ స్టార్ హీరోతో దాదాపు మూడు సినిమాల్లో నటించిందట.
సినిమాలోనే కాకుండా బయట కూడా ఆయనతో కలిసి తిరగటం ప్రారంభించింది..వీరిద్దరి ప్రవర్తన చూసిన కమలహాసన్ హీరో గురించి ఎంక్వైరీ చేసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుసుకొని ఆయన కుమార్తె సాదాసీదా హీరోని ప్రేమించిందని విషయం తెలుసుకోవడంతో ఆయన కెరీర్ పై దెబ్బకొట్టాడు అయితే ఇప్పటికీ కూడా ఆయన అడపాదడపా సినిమాలను చేస్తూ అవి కూడా సక్సెస్ కావటం లేదని తెలుస్తోంది ఇంతకు ఆ హీరో ఎవరబ్బా అంటూ అభిమానులు వెతకడం మొదలుపెట్టారు.