అందుకుంది. ఇక ఎన్టీఆర్ కూడా ఈ మధ్యనే ఒక సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ అమీగోస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ మధ్యనే లోకేష్ పాదయాత్రలో తారకరత్న కి గుండెపోటు రావటం అకస్మాత్తుగా హాస్పిటల్ కి తరలించడం ఇవన్నీ హుటాహుటిన జరిగిపోయాయి అన్న సంగతి తెలిసిందే.
ఇక తారకరత్ననీ బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉంచారు.అయితే తారకరత్న గురించి ఈమధ్య ఎలాంటి అప్డేట్ వారి కుటుంబ సభ్యులు ఇవ్వడం లేదు. ఎవరిని అడిగినా చికిత్స జరుగుతోంది. అని అంటున్నారు.అయితే తారకరత్న ఆరోగ్యం గురించి కళ్యాణ్ రామ్ మరోసారి స్పందించారు. గతంలో కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా తారకరత్న ఆరోగ్యం గురించి స్పందిస్తూ ట్విట్ చేశారు. తాజాగా తను నటించిన అమిగోస్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయంలో నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు.
ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను నటించిన అమీగోస్ సినిమా రిలీజ్ సందర్భంగా సినిమా గురించి కొన్ని విషయాలను చెబుతూనే తారకరత్న ఆరోగ్యం గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. తారకరత్న బాగున్నాడని ఆరోగ్యం కాస్త కుదుటపడిందని కళ్యాణ్ రామ్ మాటల్లో చెప్పారు. అయితే నేను ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వలేను.ఎందుకంటే నేను మెడికల్ ఎక్స్పర్ట్ ను కాదు అన్నారు. ఎక్స్పర్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో తారకరత్నకు ట్రీట్మెంట్ జరుగుతోందని త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని నమ్మకం తనకుందని కళ్యాణ్ రామ్ మాటల్లో చెప్పుకొచ్చారు.