టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దశాబ్ధ కాలం పైగా చెలామని అవుతున్న కాజల్ అగర్వాల్ ఈమధ్య కెరియర్ లో కాస్త వెనుకపడినట్టు అనిపించినా మళ్లీ ఊపందుకునేలా చేసుకుంది. ఓ పక్క సీనియర్ హీరోలతో పాటుగా యువ హీరోలతో కూడా నటిస్తూ సత్తా చాటుతున్న కాజల్ స్పెషల్ సాంగ్స్ కు రెడీ అంటుంది. ఆల్రెడీ జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ అంటూ తన సెక్సీ అప్పియరెన్స్ తో కురాళ్ల హృదయాలను గాయపరచిన అమ్మడు ఇప్పుడు మరోసారి స్పెషల్ ఐటం కు రెడీ అవుతుందట.
త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ సెట్స్ మీద ఉంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుందని అంటున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ పై వస్తున్న వార్తలను ఖండించింది కాజల్. తాను ఎలాంటి స్పెషల్ సాంగ్ చేయట్లేదని. వస్తున్న వార్తలపై నిజం లేదని చెప్పుకొచ్చింది. అసలు అలాంటి ఆఫర్ తనకు రాదని వచ్చిన చేసే ఉద్దేశం లేదని అంటుందట.
ఒకవేళ మెయిన్ హీరోయిన్ గా కాకుండా ఇక మీదట అలాంటి ఛాన్సులే వస్తాయని అందుకుంది కాబోలు కేవలం తారక్ కోసమే తాను ఐటం సాంగ్ చేశా తప్ప మిగతా ఏ హీరో సినిమాలో చేయనని అప్పట్లో చెప్పింది కాజల్. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉంటూ బన్ని సినిమాలో ఛాన్స్ వచ్చినా సరే నో అని చెబుతుందట. మరి కాజల్ స్పెషల్ సాంగ్ ఉంటుందా లేదా అన్నది బన్ని అండ్ టీం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.