టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత మగధీర ,చందమామ తదితర చిత్రాలతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో పేరు సంపాదించింది. ఒకానొక సమయంలో కాజల్ అగర్వాల్ డేట్స్ ఖాళీగా లేక చాలామంది దర్శకులు సినిమాలు వాయిదా వేసుకున్న రోజులు కూడా ఉన్నాయట.
అలాంటి కాజల్ అగర్వాల్.. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది.గడిచిన కొద్ది రోజుల క్రితం ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది. దీంతో కొన్ని రోజుల నుంచి ఆమె మాతృత్వాన్ని బాగా ఎంజాయ్ చేస్తు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నది. ప్రస్తుతం కాజోల్ చేతిలో భారతీయుడు -2 సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే కాజల్ అగర్వాల్ కు తెలుగు ఇండస్ట్రీలో నచ్చని ఒకే ఒక్క హీరో రామ్ చరణ్ నేనట. నచ్చిన ఏకైక హీరో చిరంజీవి అంట. రామ్ చరణ్ నచ్చకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే రామ్ చరణ్ కాజల్ ను విసిగిస్తూ ఉండేవాడట. కాజల్ ,రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం మగధీర. ఈ సినిమా షూటింగ్ సమయంలో కాస్త సైలెంట్ గా ఉన్న కొన్ని రోజుల తర్వాత కాజల్ తో పరిచయం బాగా పెరగడంతో ఆమెను ఏడిపించడం మొదలుపెట్టారట. ఆ తర్వాత గోవిందుడు అందరివాడేలే, నాయక్ ఎవడు వాటి చిత్రాలలో షూటింగ్ సమయంలో కూడా రామ్ చరణ్ పదేపదే విసిగించేవారట. ఇలా ప్రతిసారి తనని ఏడిపిస్తూ ఉంటాడని సరదాగా చెప్పుకొచ్చింది కాజల్.