దశాబ్ధం కాలంగా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ క్రేజ్ ఏర్పరచుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ చందమామ అయిన ఈ అమ్మడు కెరియర్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్లీ పుంజుకుంటూ వస్తుంది. ఇటీవల సీత సినిమాతో డిజాస్టర్ అందుకున్న కాజల్ ప్రస్తుతం ఫోటో షూట్స్ తో ఫుల్ బిజీగా ఉంటుంది. కాజల్ ఇదవరకు ఎన్నడూ చేయని హాట్ స్కిన్ షోస్ తో ఈ ఫోటో షూట్స్ ఉంటున్నాయి.
ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క ఇలా ఫోటో షూట్స్ చేయడం హీరోయిన్స్ కు ఒక హాబీగా మారింది. అయితే ఎప్పుడూ లేని విధంగా కాజల్ ఈమధ్య వరుస ఫోటో షూట్స్ చేస్తుంది. రెండు మూడు రోజుల గ్యాప్ తో కాజల్ ఈ ఫోటో షూట్స్ బయటకు వస్తున్నాయి. అయితే దీని వెనుక అసలు కథ వేరే ఉందట. స్టార్ హీరోయిన్ కాజల్ ఫోటో షూట్స్ ఊరకనే ఇవ్వట్లేదట. ఫోటో షూట్ కు ఇంత అని అలా కూడా సంపాదించేస్తుందట.
అందాల ప్రదర్శనకు అదిరిపోయే రేటు అట. వేసుకునే కాస్టూం ను బట్టి ఈ రేటు ఫిక్స్ చేస్తారట. సో హీరోయిన్స్ ఎందుకు ఇలా ఫోటో షూట్స్ చేస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఇదే అన్నమాట. సినిమల్లో చేస్తేనే డబ్బులు కాదు ఇలా రెచ్చిపోయి ఫోటో షూట్ చేసినా సరే డబ్బులు ఇస్తారట. మిగతా హీరోయిన్స్ గురించి ఏమో కాని కాజల్ మాత్రం ఫోటో షూట్స్ ద్వారా కూడా సంపాదించేస్తుంది.