తెలుగు సినీ ఇండస్ట్రీలో చందమామ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ కాజల్ అగర్వాల్. మగధీర చిత్రంతో ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన ముఖ్యంగా చిరంజీవి రామ్ చరణ్ ,పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్, మహేష్ బాబు తదితర హీరోలతో కూడా నటించి మంచి విజయాలను అందుకుంది.
టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తన సెకండ్ మొదలు పెట్టడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది.తాజాగా బాలయ్య అనిల్ రావుపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో బాలయ్యకు జోడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలోనే కాజల్ అగర్వాల్ కి సంబంధించి పాత విషయాలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఈమె పైన ట్రోల్ చేయడం కూడా జరుగుతోంది. గతంలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రేమాయణం నడిపినట్లుగా కూడా వార్తలు వినిపించాయి.
అయితే అల్లు అర్జున్ ,కాజల్ అగర్వాల్ మొదటిసారిగా ఆర్య-2 చిత్రంలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఎవడు సినిమాలో కూడా ఇద్దరు కలిసి నటించడం జరిగింది. అప్పుడు కూడా వీళ్ళ జంటకి మంచి పాజిటివ్ టాక్ వినిపించింది ఆ తర్వాత బన్నీ కాజల్ చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారని వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి. అయితే చివరికి కాజల్ అగర్వాల్ మాత్రం తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ను వివాహం చేసుకుంది.
కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్న తర్వాత కూడా న్యూస్ చాలాసార్లు వైరల్ గా మారుతోంది .అయితే గౌతమ్ కాజోల్ ని ఏనాడు కూడా ఈ విషయంపై అడగలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం తన పని తాను చూసుకుంటూ సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు.. అయితే ఇలాంటి రూమర్స్ అన్ని ఇండస్ట్రీలో కామన్ గా వినిపిస్తూ ఉంటాయని లైట్‌గా తీసుకున్నారట గౌతమ్.