Kajal..టాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ (Kajal)అగర్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..మొదట చందమామ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆమె అందానికి కుర్రకారుల సైతం ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. ఆ తర్వాత తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో దాదాపుగా దశాబ్దపు కాలం పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. కాజల్ అగర్వాల్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా ఉన్నాయి. కాజల్ కెరియర్ లో ఇప్పటివరకు ఎలాంటి మచ్చ కూడా లేదని చెప్పవచ్చు.
చాలామందిపై ఎదో రూమర్స్ వచ్చింది కానీ .. కాజల్ అగర్వాల్ మీద ఎప్పుడూ కూడా ఎలాంటి చెత్త రూమర్ అయితే రాలేదు. ఎందుకంటే ఆమె అలా ఎప్పుడూ ప్రవర్తించేది కాదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తుంటాయి. ఎంతో మంది హీరోలకు లిప్ లాక్ లు ఇచ్చిన సరే తన హద్దుల్లో తాను ఉంటుంది. అయితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కాజల్ అగర్వాల్ కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదా అనే విషయం పైన స్పందించడం జరిగింది.
కాజల్ అగర్వాల్ గతంలోకి ఇంటర్వ్యూలో పాల్గొన్నాపుడు.. క్యాస్టింగ్ కౌచ్ మీద స్పందించడం జరిగింది. ఇండస్ట్రీలో రాణించాలనే కల వుంటుంది.కానీ దాన్ని అడ్డుకోవడానికి ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అనేది తయారయ్యింది. దాన్ని నేను కూడా ఎదుర్కొన్నాను నన్ను కెరియర్ స్టార్టింగ్ లో ఒక యాడ్ కోసం ఒక డైరెక్టర్ కమిట్మెంట్ అడిగారని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.
కానీ అందుకోసం నేను ఒప్పుకోలేదు. ఆ తర్వాత తన సొంత టాలెంట్ తోనే స్టార్ హీరోయిన్గా మారానని ఇక హీరోయిన్గా అవకాశాలు వస్తున్న తర్వాత నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు.. ఏదైనా సరే మనం ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది అని తెలియజేస్తోంది కాజల్ అగర్వాల్ కాబట్టి అన్నీ మనకు అనుకూలంగా ఉండాలి అంటే కుదరదంటూ తెలియజేసింది ఈ అమ్మడు.