టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇటీవలే అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని ఆయన కాపాడేందుకు కృషి చేస్తున్నాం అంటూ ఇటీవలే అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున పుకార్లు వినిపిస్తున్నాయి.కైకాల పరిస్థితి విషమించిందని పరిస్థితి చేయి దాటింది అంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టుకొస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయంపై కైకాల సత్యనారాయణ కూతురు రమాదేవి స్పందించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు చెక్ పెడుతూ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, అతను కోరుకుంటున్నారని, అలాగే చికిత్సకు కూడా స్పందిస్తూ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే అతని ఆరోగ్యం మెరుగుపడిందని ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నట్లు ఆమె తెలిపింది. అలాగే ఆరోగ్యం పట్ల అనవసరపు ప్రచారాలు చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. అలాగే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నమ్మకండి, ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందని ఆమె స్పష్టం చేసింది.