అప్పుడేమో రూ .4కోట్లు ఇప్పుడు రూ .50 కోట్లు.. కాంతారా హీరో..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడుదలైన చిత్రాలు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాయి. అలా తాజాగా విడుదలైన కాంతారా చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఏకంగా రూ .400 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. కేవలం రూ .20 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ చిత్రానికి డైరెక్టర్ కం హీరో రిషబ్ శెట్టి చేయడం జరిగింది.

Rishab Shetty recalls when people sold free tickets of his film to buy  booze - Hindustan Times

అద్భుతమైన టేకింగ్ మరియు తీసుకున్న సబ్జెక్టు ఈ హీరో స్థాయిని పెంచాయని చెప్పవచ్చు. కాంతారా చిత్రంతో ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పేరు సంపాదించారు రిషబ్ శెట్టి. కన్నడ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కేవలం రూ .4 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా సమాచారం. హీరోగా నటించినందుకు దర్శకత్వం చేసినందుకు కూడా ఆయనకు దక్కింది మొత్తం ఇదే అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కాస్త డబ్బులు హాంబలే బ్యానర్ వారు ఇచ్చినట్లుగా సమాచారం.

అయితే ఇప్పుడు రిషబ్ శెట్టి స్థాయి అమాంతం పెరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ .40 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు ఎంతో మంది నిర్మాతలు సైతం ముందుకు వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో సినిమాలు నిర్మించేందుకు కొన్ని వందల కోట్ల బడ్జెట్ కూడా సిద్ధమే అన్నట్లుగా నిర్మాతలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఒక చిత్రానికి రూ .50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈసారి తెరకెక్కించబోయే చిత్రం 200 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కించ బోతున్నట్లు సమాచారం. మరీ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.

Share.