టాలీవుడ్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కబోతుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన సాంగ్ లకు, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇది ఇలా ఉంటే మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ను రివిల్ చేస్తూ వస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి మరొక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. యమదొంగ,, కంత్రీ,అదుర్స్,రభస, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలలో తారక్ తన గొంతును వినిపించాడు. కేవలం తన సినిమాలలోనే కాకుండా పునీత్ రాజ్కుమార్ నటించిన కన్నడ సినిమా చక్రవ్యూహ లో కూడా ఎన్టీఆర్ ఒక పాటను ఆలపించాడు. చాలా గ్యాప్ తర్వాత తారక్ మళ్లీ తన గొంతును సవరించారట. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే తారక్ అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోతుంది. అలాగే ఈ సినిమా హైప్ మరో రేంజ్ కి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది.