టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ షూటింగ్ నుంచి కాస్త విరామం దొరకటంతో, తన ఫ్యామిలీ ని తీసుకొని ప్యారిస్ వెళ్ళాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి ప్యారిస్ పర్యటనలో ఉన్నారు. ఒకవైపు ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తవడంతో, మరొకవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షో ఎపిసోడ్స్ పూర్తి అవడంతో తన ఫ్యామిలీతో కలిసి అలా సరదాగా గడిపేందుకు ప్యారిస్ వెళ్లారు.
అక్కడ తన భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాజాగా ఎన్టీఆర్ తన పెద్ద కొడుకు అభయ్ రామ్ ను ఈఫిల్ టవర్ వద్ద ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడ లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తూ తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేస్తూ నాకు ఎన్నో చెప్పాలని ఉంది కానీ ప్రస్తుతానికి ఈ జర్నీ ని ఎంజాయ్ చేస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.