ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం కొత్త ఏమీ కాదు. ఎందుకంటే సినిమాలో వచ్చే డబ్బుతో.. వారి భవిష్యత్తుకు పునాదులు వేసుకోలేరు కాబట్టి సినీ ఇండస్ట్రీలో వచ్చే డబ్బులతో రియల్ఎస్టేట్ రంగం, సినిమా థియేటర్లు ఇలా రకరకాల రంగాలలో ఇన్వెష్ట్ చేస్తూ ఆర్థికంగా మెరుగుపడటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాదు వాణిజ్య ప్రకటనలలో కూడా నటిస్తూ రెండు చేతులు బాగానే సంపాదిస్తున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం రంగాలతోపాటు మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించడమే కాకుండా వాణిజ్య ప్రకటనల ద్వారా సినిమాల ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారు. బైజూస్ కి మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటిదే మరో లెర్నింగ్ యాప్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట మహేష్ బాబు. సీనియర్ కేజీ విద్యార్థుల నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ స్టూడెంట్ లకు అందరికీ పనికొచ్చే లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఒక యాప్ ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ యాప్ కు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్నట్లు సమాచారం.