అభిమాని ఫోన్ లాక్కున్న హీరో.. ఏం చేశాడంటే?

Google+ Pinterest LinkedIn Tumblr +

మామూలుగా అభిమానులు తమ అభిమాన హీరో హీరోయిన్లు కనిపిస్తే వారితో సెల్ఫీలు దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటిది అభిమాన సెలబ్రిటీలు రోడ్డుపై కనిపిస్తే ఇంకేముంది ఆ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. వారితో కనీసం ఒక్క ఫోటో అయినా దిగాలి అని తెగ ఆరాట పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ సెలబ్రిటీలకు తెలియకుండా కొందరు పోటోలను తీస్తూ ఉంటారు.తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.

బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం తన స్నేహితుడితో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా.. ఇద్దరూ అభిమానులు బైక్ పై కూర్చొని సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తున్నారు. అంత లో జాన్ అబ్రహం వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ చేతుల్లో నుంచి ఫోన్ లాక్కున్నాడు.

అనంతరం కెమెరా వైపు చూస్తూ హాయ్ గాయ్స్ ఇప్పుడు ఓకేనా అంటూ నవ్వుతూ మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక స్టార్ హీరో అయ్యుండి అభిమానులను ఇలా పనిగా ఆటపట్టించడం బలే గా ఉందని కొందరు నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Share.