జై భీమ్ సినిమా కు దక్కిన అరుదైన గౌరవం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం జై భీమ్. సూర్య ఈ మధ్యకాలంలో ఎక్కువగా విభిన్నమైన కథలతో పాటు తమిళ ప్రేక్షకులను, తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాడు. తాజాగా నిజ జీవిత ఘటనల ఆధారంగా జై భీమ్ సినిమా ని డైరెక్టర్ జ్ఞానవేల్ తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీ లోనే విడుదల చేయడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

తన గత చిత్రం ఆకాశమే నీ హద్దురా కూడా ఓటిటీలో విడుదల చేయడం వల్లే.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తాజాగా జై భీమ్ సినిమా..2022 గోల్డెన్ గ్లోబ్ అవార్డు కి నామినేట్ అవడం అనేది ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఈ చిత్రం బెస్ట్ నాన్ ఇంగ్లీష్ భాష చిత్రంగా నామినేట్ అయింది. గతచిత్రం ఆకాశమే నీ హద్దురా కూడా ఇలాంటి అరుదైన ఫీట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు కూడా ఈ జై భీమ్ సినిమా ఇలా ఎంపిక కావడంతో సూర్య అభిమానులు చాలా సంబరపడిపోతున్నారు.

Share.