Janhvi Kapoor.. ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లికి తగ్గ అందంతో అభినయంతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ భారీగా పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా ఇందులో ఎన్టీఆర్ మాత్రమే కాకుండా ఇంకో ఇద్దరు తెలుగు హీరోల సినిమాలలో కూడా ఈ ముద్దుగుమ్మకే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటించలేదు కానీ రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేసే సినిమాలో జాన్వీ కపూర్ అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా జాన్వి కపూర్ గురించి ఒక వార్త యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు సృష్టించి మరి కనిపిస్తోంది. ఇక అందులో ఏముంది అంటే జాన్వీ కపూర్ రహస్యంగా ఒకరితో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయిందని.. అయితే రహస్యంగా తీయించుకుందనే వార్తలు రాసుకు వచ్చారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో డేటింగ్ అనేది చాలా సహజంగా మారిపోయింది . నచ్చితే వారితో రిలేషన్ కంటిన్యూ చేస్తారు లేకపోతే బ్రేకప్ చేసుకొని ఇంకొకరితో మూవ్ అవుతారు. ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ కూడా ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసిందని అయితే అందులో ఒకరితో డేటింగ్ చేసి ప్రెగ్నెంట్ అయిందని ఆ విషయం తెలిసి ఇంట్లో గొడవ జరగడంతో తన సినిమాలకు ఆటంకం కలగకుండా ఒక ప్రముఖ హాస్పిటల్ లో అబార్షన్ చేయించుకుందని సమాచారం.
అయితే తాజాగా ఈ వీడియో కాస్త బోనీ కపూర్ కంటపడడంతో ఆయన ఈ వార్తలపై మండిపడ్డారు. ఇంకొకసారి ఇలాంటి చెత్త వార్తలు తన కూతురు గురించి రాస్తే రియాక్షన్ వేరేలా ఉంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.