33 యేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న జీవిత రాజశేఖర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో రాజశేఖర్ భార్యగా నేటితరం ప్రేక్షకులకు తెలిసిన ఒకప్పుడు హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన జీవిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా స్వస్తి చెప్పి దాదాపు 33 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆమె స్క్రీన్ పై కనిపించడానికి సిద్ధమవుతోంది.

Jeevitha Rajasekhar's re-entry with Rajinikanth film

పూర్తి వివరాల్లోకెళ్తే 1984లో హీరోయిన్ గా మారిన జీవిత మొదటి సారి తమిళంలో తన తొలి సినిమా చేశారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు అక్కడే వరుసగా చిత్రాలు చేసి విజయాలు అందుకున్న ఈమె తెలుగులో తలంబ్రాలు మూవీ ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత జానకి రాముడు, ఆహుతి, అంకుశం, మగాడు లాంటి సినిమాలను హీరోయిన్గా చేశారు. 1990లో చివరిగా మగాడు సినిమాలో నటించిన జీవిత అందులో హీరోగా నటించిన రాజశేఖర్ ను పెళ్లి చేసుకొని సినిమాలలో నటనకు స్వస్తి పలికారు. ప్రస్తుతం డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు చేస్తున్న ఈమె తన భర్త రాజశేఖర్ హీరోగా సత్యమేవ జయతే , మహంకాళి , శేఖర్, శేషు సినిమాలను దర్శకత్వం వహించారు.

ఇక ఈమె ఇద్దరు కూతుర్లు శివాత్మిక, శివాని కూడా ప్రస్తుతం హీరోయిన్లుగా చేస్తున్నారు. ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూనే మరొకవైపు రాజకీయాలలో కూడా యాక్టివ్ గా ఉన్న జీవిత.. ఇప్పుడు యాక్టర్గా రీఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.. ఐశ్వర్య రజనీకాంత్ తీస్తున్న లాల్ సలాం సినిమాలో రజనీకాంత్ కి చెల్లెలి పాత్రలో జీవిత తను సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారు. దీన్నిబట్టి చూస్తే దాదాపు 33 సంవత్సరాల తర్వాత ఆమె మేకప్ వేసుకోబోతోంది. మార్చి ఏడవ తేదీ నుంచి చెన్నైలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.

Share.