ఏ సిని ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మధ్య కమ్యూనికేషన్ తప్పనిసరిగా ఉండాలి.. ఎందుకంటే వారు స్క్రీన్ పై కమ్యూనికేషన్ బాగుండాలంటే వారు బయట కూడా మంచి స్నేహితులుగా మెలిగితేనే స్క్రీన్ పై కూడా మంచి కెమిస్ట్రీనీ పండించగలరు. హీరో హీరోయిన్స్ మధ్య మంచి కమ్యూనికేషన్ ఉండటం కామన్ కానీ అలాంటిది వారిద్దరి మధ్య ఏదో ఎఫైర్ ఉంది అంటూ చాలామంది పలు రకాల వార్తలను సృష్టిస్తూ ఉంటారు. కొంతమంది మధ్య ఎఫెర్ ఉందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
అయితే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు హీరోగా అందరికీ సుపరిచితమే.. జయలలిత స్టార్ హీరోయిన్గా ఎదిగిన సంగతి మనకు తెలిసిందే.. అయితే తమిళ్ హీరోయిన్ జయలలిత కూడా ఒకప్పుడు తమిళ, తెలుగు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే టాలీవుడ్లో కంటే తమిళ్ లోనే ఆమెకు మంచి అవకాశాలు రావడం అలాగే స్టార్ హీరోయిన్ పొజిషన్కు ఎదగటం జరిగింది.
శోభన్ బాబు ,జయలలితతో నటించటానికి చాలా ఇంట్రెస్ట్ చూపించే వాడట మొదట్లో. కానీ ఆమె మాత్రం నేను చిన్న హీరోలతో చెయ్యను స్టార్ హీరోలతో మాత్రమే చేస్తాను అని చెప్పేదట.. అప్పటినుంచి ఆయన చాలా ఫీల్ అయినట్లుగా అప్పట్లో మీడియా కథనాలు వచ్చాయి. ఆ తరువాత శోభన్ బాబు స్టార్ హీరో అయ్యాడు అప్పుడు ఆమెతో పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలను నటించి ఒక ముద్రను వేసుకున్నాడు. అప్పట్లో ,ఇప్పట్లో అయినా ఎక్కువ ఏ హీరోలతో సినిమాలు చేస్తే వారితోనే ఎఫైర్లు హీరోయిన్లకు ఉన్నట్లుగా సృష్టిస్తూ ఉన్నారు.
జయలలిత ,శోభన్ బాబు మధ్య ఇలాంటి ఎఫైర్ ఉందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా వీరికి ఒక పాప కూడా జన్మించింది అనే వార్తలు కూడా వినిపించాయి కానీ ఇంతవరకు మాత్రం ఈ విషయాన్ని ఎవరు నిరూపించలేకపోయారు.