సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న జవాన్‌.. సలాం కొడుతున్న జనం!

Google+ Pinterest LinkedIn Tumblr +

మెగా కాంపౌండ్ నుండి వచ్చి సుప్రీం హీరోగా ఇమేజ్ సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయాడు. అయితే ఆ తరువాత వరుసగా ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్నాడు. మూడు ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టిన తేజు ఆ తరువాత చేసిన జవాన్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారింది. బివిఎస్ రవి డైరెక్షన్‌లో ఈ చిత్రం వస్తుండటంతో ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందా అని చూశారు జనాలు.

కానీ ఈ సినిమా కూడా తేజు గత చిత్రాలలాగ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో జవాన్ అండ్ టీమ్ షాక్‌కు గురయ్యారు. అందాల భామ మెహ్రీన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. అయితే ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదేమిటీ.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన బొమ్మ.. యూట్యూబ్‌లో సెన్సేషన్ ఎలా క్రియేట్ చేస్తోంది అనుకుంటున్నారా.. అయితే ఇది సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది తెలుగులో కాదులెండీ.. హిందీలో.

జవాన్ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేయగా అది బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది. రిలీజ్ అయిన రెండు రోజుల్లో కోటి వ్యూస్ సాధించడంతో యూట్యూబ్‌లో జవాన్ సలాం కొట్టించుకున్నాడని క్రిటిక్స్ అంటున్నారు. ఏదేమైనా ఇలా తెలుగులో ఫ్లాప్ అయిన చిత్రాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుండటంతో నిర్మాతలకు కొంతలో కొంత లాభం చేరుతుండటం విశేషం.

Share.