అతిలోకసుందరి అందాల తార జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సాధారణంగా టాలీవుడ్ తో పోల్చుకుంటే బాలీవుడ్లో ప్రేమ వ్యవహారాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్లో సెలబ్రిటీల డేటింగ్ వ్యవహారాలకు సోషల్ మీడియాలో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ డేటింగ్ కి సంబంధించిన విషయం ఒకటి నెట్టంట చాలా వైరల్ గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్ డేటింగ్ చేస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆ వార్తలు నిజమయ్యేలా మరొకసారి ప్రియుడుతో కెమెరాకు చిక్కింది ఈ వయ్యారి.. ముంబై ఎయిర్పోర్టులో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కనిపించింది. తాజాగా మార్చి 31వ తేదీన నీతా అంబానీ ఈవెంట్ కు హాజరైన జాన్వీ తోపాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా అక్కడ దర్శనం ఇచ్చాడు. అయితే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఇద్దరూ కూడా వేరువేరు కార్లలో వెళ్లిపోయారు. కానీ ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మాత్రం నెట్టింట చాలా వైరల్ అవ్వడమే కాదు.. వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని మరొకసారి స్ప్రెడ్ చేస్తున్నారు.
ఇప్పటికే శిఖర్ పహారియా చాలాసార్లు పబ్లిక్ ప్లేసుల్లో కనిపించి.. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.. కానీ వీటిపై మాత్రం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇక ఇప్పుడు మరొకసారి ఇలా ఇద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఈ ఇష్యూ కాస్త మళ్ళీ వైరల్ అవుతుంది. ఇక జాన్వీ కపూర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.