తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన ప్రతి చిత్రంతో ఎదుగుదలతో తెలుగు సినిమా క్యాతిని ఒక్కసారిగా ఊహించని స్థాయిలో తీసుకువెళ్లారు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే కచ్చితంగా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుందని భావన ప్రేక్షకులలో కలిగేలా చేశారు. ఇతర ఇండస్ట్రీలో నుంచి భారీ రెమ్యూనరేషన్ ఆఫర్లు వచ్చినప్పటికీ రాజమౌళి మాత్రం వాటికి నో చెబుతూ ఉండడం గమనార్హం.
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో తెలుగు సినీమాలతో పోటీపడి విడుదల చేసిన పెద్దగా మెజారిటీ అందుకోలేకపోయాయి. బాలీవుడ్ సినిమాల నిర్మాతలకు కూడా భారీ నష్టాలని మిగిల్చాయి. బాలీవుడ్ సినిమాల ఫలితాలపై రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. రాజమౌళి మాట్లాడుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కార్పొరేట్లు అడుగుపెడుతున్నారని వాళ్ళు అడుగు పెట్టినప్పటి నుంచి డైరెక్టర్లు, నటీనటులు పారితోషకాలు పెరిగాయని రాజమౌళి తెలిపారు.
ఏదో ఒక విధంగా డబ్బు చేతికి వస్తూ ఉండడంతో సక్సెస్ను సొంతం చేసుకోవాలని కసి వాళ్ళల్లో కొంత తగ్గిందని రాజమౌళి తమ అభిప్రాయంగా తెలిపారు. ఈ రీజన్ వల్లే బాలీవుడ్ చిత్రాలు ఎక్కువగా సక్సెస్ కాలేకపోతున్నాయని తెలిపారు. సౌత్ ఇండియాలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉందని తెలిపారు. సౌత్ లో సక్సెస్ కోసం ఈదాలని లేకపోతే మునిగిపోతారని రాజమౌళి తెలియజేశారు. సౌత్ సినీ ఇండస్ట్రీలోని రాజమౌళి బాగా పేరు సంపాదించారు. అయితే సినిమా ప్రకటనకు వచ్చిన ఆదరణ చూసి సంతోషపడకూడదని సినిమాకు జరిగిన బిజినెస్ చూసి అసంతృప్తి చెందకూడదని ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చే వరకు చాలా కృషి చేయవలసి ఉంటుందని రాజమౌళి తన అభిప్రాయంగా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.