శ్రీకాంత్, సునీల్ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీష్‌గౌతమ్‌లను నటులుగా పరిచయం చేస్తూ వి. విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి. సాయిఅరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన సునీల్ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని ‘జైసేన’ అనే టైటిల్ సాంగ్‌ను, పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. మెగాబ్రదర్ నాగబాబు ఈ పాటను విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో టీజర్ విడుదల అయింది. ఇందులో శ్రీకాంత్ చెప్పే డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
ఇక ఈ చిత్రం ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ముఖ్యంగా ఇందులో “ఆయోధ్యలో రామాలయం కట్టడానికి మూడు పూటల అన్నం తినాలంని ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది.. కానీ అన్నం పండించే రైతు బాగుండాలని ఎవరూ కోరుకోవడం లేదు“ మరియు “నీ లాంటి కూరాళ్లు ఆవేశపడితే బాడీకి లాస్.. మోడీ గారు ఆవేశపడితే మన ఇండియాకు లాస్“ అంటూ శ్రీకాంత్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ చిత్రం ట్రీజర్ మీరూ చూసేయండి.