జై బాలయ్య వీడియో సాంగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కళ్యాణ్ రామ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ హీరోగా, హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ఈ సినిమాను ద్వారక క్రియేషన్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా బోయపాటి శ్రీను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా బాలయ్య, బోయపాటి శ్రీనుకు హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కిస్తుడడం విశేషం. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు సినిమాపై మంచి ఆసక్తిని నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా నుండి జై బాలయ్య అనే పాటను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ అందిస్తున్నారు. ఈ సినిమా కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. అయితే తాజాగా ఈ పాట పై నందమూరి కళ్యాణ్ రామ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బాలయ్య ఫుల్ ఫ్లో లో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు కళ్యాణ్ రామ్. మాస్ జాతరను డిసెంబర్ 2వ తేదీన థియేటర్లో చూసేందుకు ఆగలేక పోతున్నాను అంటూ తెలియజేశారు.

Share.