జగపతి బాబు ఒకప్పుడు తెలుగు నాట స్టార్ హీరో గా వెలుగొందరు. కానీ అదంతా గతం 90 వ దశకంలో జగపతి బాబు కి మహిళా ప్రేక్షకులు మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండేది. ఎన్నో హిట్ చిత్రాలని అయన టాలీవుడ్ కి అందించారు. అయితే జగపతి బాబు కి తర్వాత సినిమాలు లేకపోవటంతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకున్నారు. ఒక సమయంలో అయన కూతురు వివాహం జరిపించడానికి కూడా తన వద్ద డబ్బులు లేవట, అందుకే ఏదో చిన్న మండపంలో ఉన్న దాంట్లో మా అమ్మాయి పెళ్లి జరిపించానని జగపతి బాబు తెలిపారు. జగపతి బాబు కూతురి వివాహం ఒక ఫారిన్ అబ్బాయి తో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇంకా మాట్లాడుతూ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ తనకి రూ 50 లక్షలు సహాయం చేసారని, అది కూడా వడ్డీ లేకుండా ఇచ్చారు, అటు తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ కి ఆ డబ్బు అవసరం ఉండి మళ్లీ అడిగారని, అందు కోసం నేను వేరొకరి వద్ద అప్పు తీసుకుని ఇచ్చానని చెప్పారు జగపతి బాబు.