ఒకానొక సమయంలో తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన నటించి సావిత్రి తర్వాత అంతటి అందంతో కట్టుబొట్టుతో యువతను ఆకట్టుకున్న సౌందర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు విమానా ప్రమాదంలో ఆమె మరణించినప్పటికీ కూడా తెలుగింటి ఆడపడుచుల తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇదిలా వుండగా మరొకవైపు ఒకప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న సీనియర్ హీరో జగపతిబాబు ఇటీవల ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని అందులో భాగంగానే సౌందర్యా తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఇకపోతే ఇంటర్వ్యూలో భాగంగా స్వర్గీయ నటి సౌందర్య కి మీకు మధ్య ఎఫైర్ ఉందని పలు వార్తలు వినిపించాయి కదా? దీనిపై మీ స్పందన ఏమిటి ? అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు జగపతిబాబు.. జగపతిబాబు మాట్లాడుతూ..నిర్మొహమాటంగా అవును.. ఎఫైర్ ఉందని స్పష్టం చేశాడు.. అంతేకాక ఎఫైర్ అంటే సంబంధం అని అర్థం వస్తుందని.. తనకు నటి సౌందర్య తో అప్పట్లో మంచి సంబంధం మరియు సాన్నిహిత్యం కూడా ఉండేది అంటూ ఆయన వివరణ ఇవ్వడం జరిగింది.
అలాగే సౌందర్య కుటుంబ సభ్యులు కూడా తనతో చాలా సన్నిహితంగా మెలిగే వారిని అందువల్లే తనను తమ ఇంట్లో ఒకడిగా చూసేవారని చెప్పుకొచ్చారు. దీంతో కొంతమంది తమ మధ్య ఉండేటటువంటి చనువుని చూసి ఎఫైర్ అంటూ వార్తలు క్రియేట్ చేశారు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.. సౌందర్య అంటే తనకు చాలా అభిమానం అని కానీ ఇతరులు తనను తప్పుగా భావించారు అంటూ చెప్పుకొచ్చారు.. ఇకపోతే ఇలాంటి విషయాల గురించి తాను అస్సలు పట్టించుకోనని నచ్చింది చేస్తూ ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఇకపోతే ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కులమతాలను చూడరు కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం కులమతాలను ఎందుకు చూస్తారో ఇప్పటికీ అర్థం కాలేదు అని కూడా తెలిపారు జగపతిబాబు.