ఒకే ఏడాది అన్ని సక్సెస్ అందుకున్న జగపతిబాబు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట హీరోగా ఆ తర్వాత విలనగా నటించి అంతే స్టార్ డం సంపాదించుకున్నారు. నటుడు జగపతిబాబు తన ఏ పాత్ర పోషించిన ఆ పాత్రకు తగ్గట్టుగా న్యాయం చేస్తారని చెప్పవచ్చు. జగపతిబాబు ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా బాగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 1997లో వచ్చిన సినిమాలు జగపతిబాబు కెరియర్ అనే మలుపు తిప్పాయ అని చెప్పవచ్చు. ఆ ఏడాది 6 సినిమాలు చేసి విడుదల చేయాలో ఒక ప్లాపు కూడా కాలేదట.వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Jagapathi Babu on Balakrishna's Legend Controversy: Bad Timing

ముఖ్యంగా ఆయేడాది మొదట విడుదలైన శుభాకాంక్షలు చిత్రం రెండు కుటుంబాల మధ్య జరిగేటటువంటి కొన్ని వ్యవహారాల ద్వారా తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రాశి హీరోయిన్గా రవళి కూడా నటించింది. అలాగే సౌందర్యతో కలిసి చేసిన ప్రియరాగాలు సినిమా కూడా జగపతిబాబుకు మంచి విజయాన్ని అందించింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించగా కీరవాణి సంగీతాన్ని అందించారు.

మరొక మూవీ ఒకరికొకరు ఈ చిత్రంలో హీరోయిన్గా ఇంద్రజ నటించిన ఈ సినిమా కూడా ఎమోషనల్ టచ్ తో బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. అదే ఏడాది వచ్చిన దొంగాట సినిమా కూడా మరొక విజయాన్ని అందించింది
ఈ చిత్రంలో జగపతిబాబు,సౌందర్య, సురేష్ నటించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన చిలక్కొట్టుడు మూవీ కూడా ఆ ఏడాది పర్వాలేదు అనిపించుకుంది. మరొక సినిమా పెళ్లి సందడి సినిమాతో జగపతిబాబు మంచి హిట్టును అందుకున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు నటన అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఈ సినిమాకి డైరెక్టర్ కోడి రామకృష్ణ హీరోయిన్గా రాశి నటించింది.

Share.