ఒక నటుడు తన నటనని ప్రతిభాను పెంచేందుకు పాత్రలో లీనం అయ్యేందుకు మందు తాగడం కరెక్టా కాదా అన్న విషయం చాలా విస్తృతమైన పరిధి ఉన్న అంశమని చెప్పవచ్చు. అయితే ఇందులో కొంతమంది మాత్రం తప్పేముందని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ అది ఆర్టిస్ట్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. తను తెరకెక్కించిన అంతఃపురం సినిమాలో జగపతిబాబు క్యారెక్టర్ బాగా వచ్చేందుకు అతను సీన్ చేసేటప్పుడు తానే టాకీల షాట్స్ ఇచ్చినట్లు కృష్ణవంశీ తెలిపారు.
టకీల తాగాకే షార్ట్ పెట్టే వాడినని వెల్లడించారు. అతనికి కంట్రోల్ చేసుకోనే స్థాయి ఉంది. ఈ మందు తాగడం వల్ల అతనిలో కొన్ని మాస్కులు ఎగిరిపోయి. సిన్ అద్భుతంగా వచ్చాయని తెలియజేశారు. ఇప్పుడు కూడా ఆ పాత్ర గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు అంటే తను ఎంతగా నటించారో గుర్తు చేశారు కృష్ణవంశీ. ఈ విషయాన్ని జగపతిబాబు కూడా అంగీకరించడం జరిగింది. కొన్ని సినిమాలు కొన్ని సిచువేషన్ లో ఇలాంటి వర్కౌంటు అవుతాయని కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి విషయాలలో తప్పని లేదా ఒప్పని తాను జడ్జిమెంట్ చేయలేనని తెలిపారు.
అంతఃపురం సినిమాలో క్యారెక్టర్ చాలా వైల్డ్ గా ఉండేందుకు అలా చేశామని కూడా తెలియజేశారు. షూటింగ్ సమయంలో తాగి తప్పుగా బిహేవ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదని కూడా తెలిపారు. అయితే వెండితెరపై కళా ఖండాలు క్రియేట్ చేసి కృష్ణవంశీ తను అనుకున్న నటన రాబట్టేందుకే ఇలాంటి ట్రిక్ ఫాలో అయ్యే వారిని తెలిపారు.అలాగని వారు దాన్ని అందరూ వాడమని చెప్పడం లేదు.కేవలం తమకు అలా వర్కౌట్ అయిందని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.