ఆసియా కప్ లో భాగంగా ఈ రోజు జరగనున్న సూపర్ ఫోర్ మ్యాచ్ లో భారత్, బాంగ్లాదేశ్ తో తలపడనుంది. కొద్దీ సేపటి క్రితమే టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే మొన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్య గాయపడిన విషయం తెలిసందే. అతని స్థానంలో ఈ రోజు రవీంద్ర జడేజా ఆడనున్నాడు. ఆసియా కప్ నుండి అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ కూడా వైదొలిగారు.
ఇక బాంగ్లాదేశ్ టీం లో కూడా రెండు మార్పులు చేసారు ముషఫికర్, ముస్తాఫిజ్ టీం లో స్థానం సంపాదించగా, మోమినుల్, రోనీ కి విశ్రాంతిని ఇచ్చారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇండియా, బాంగ్లాదేశ్ టీం వివరాలు
Ravindra Jadeja replaces injured Hardik Pandya for India
2 changes for Bangladesh: Mushfiqur and Mustafizz in; Mominul, Rony OUT#INDvBAN #AsiaCup2018 #AsiaCup pic.twitter.com/BrllUq3im7
— Cricbuzz (@cricbuzz) September 21, 2018