బాలీవుడ్ బామ్మ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు తాజాగా చేదు అనుభవం ఎదురయింది. ఇండియా నుంచి వెళుతున్న జాక్వెలిన్ ను ముంబై ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. ఈమె రెండు వందల కోట్ల మనీలాండరింగ్ ఈ కేసులో నిందితుడు అయినా సుఖేష్ చంద్రశేఖర్ తో కళ్ళు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈమె చిక్కులో పడ్డట్టు అయింది. అప్పట్లో జాక్వలిన్ ఫెర్నాండెజ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంది.
ఆ తరువాత ఈమెకు చంద్రశేఖర్ తో ఎటువంటి సంబంధం లేదు అంటూ కొట్టిపారేసింది. ఇది జరిగిన కొన్ని వారాల తరువాత ఈమె చంద్రశేఖర్ ముద్దుపెట్టుకుంటూ దిగిన ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేశాయి. ఈమెకు చంద్రశేఖర్ భార్య లీనా పాల్ తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కోసం ప్రైవేట్ జెట్‌ను కూడా ఏర్పాటు చేశాడట. సుఖేష్ నుంచి జాక్వెలిన్ కోట్ల రూపాయల బహుమతి పొందినట్లు ఈడీ విచారణలో తేలిందని సమాచారం. అందులో రూ.52 లక్షల గుర్రం, రూ.9 లక్షల పెర్షియన్ పిల్లితో పాటు దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.