బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్లలో నటిస్తూ అలరించిన హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్మాండేస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితమే.. ముఖ్యంగా సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ వ్యవ హరం తో మరింత పాపులారిటీ సంపాదించింది. దీంతో జాక్వెలిన్ ఫెర్మాండేస్ పేరు కూడా సోషల్ మీడియాలో మరింత పాపులర్ అయ్యింది.
సుఖేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ ఫెర్మాండేస్ కు కొన్ని ఖరీదైన కానుకలు ఇచ్చారంటూ తెలియజేయడంతో ఈ వార్త పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన ప్రాంతంలో ఏకంగా రూ .20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఎక్కువగా నివసిస్తున్న ముంబైలోని బాంద్రా ప్రాంతంలో షారుఖ్ ఖాన్ ,సల్మాన్ ఖాన్ తదితర హీరోలు కూడా నివసిస్తున్న ప్రాంతంలో ఈమె అపార్ట్మెంట్లో ప్లాట్ కొన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈమె కొనుగోలు చేసిన కొత్త ఇల్లు సుమారు గా రూ..20 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు సమాచారం..జాక్వెలిన్ ఫెర్మాండేస్ అందుకు సంబంధించిన వీడియోలను సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. అయితే తన కొత్త ఇంటి గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో పెద్ద ఎత్తున పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇది నీకు సుఖేష్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
మరి కొంతమంది ఈ గిఫ్ట్ ఎవరిచ్చారో చెప్పాలంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్మాండేస్ పలు చిత్రాలలో నటిస్తే బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ తో కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోతూ ఉంటుంది.జాక్వెలిన్ ఫెర్మాండేస్ ఇంటికి సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram