జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పనున్న మరో కమెడియన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై ప్రసారమయ్యే షో లలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లకు చాలా క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న వారిని కూడా ఆర్టిస్టులుగా మార్చింది ఈ షో. అయితే తాజాగా ఈ షో నుంచి కొంతమంది బయటికి వెళ్లి పోవడం జరుగుతోంది. ముఖ్యంగా చమ్మక్ చంద్ర వంటి కమెడియన్స్ వెళ్ళిపోవడం వల్ల కాస్త టిఆర్పి రేటింగ్ తగ్గినప్పటికీ.. ఆది సుధీర్ వంటి కమెడియన్స్ ఉండడం వల్ల బాగానే ఈ షో ని ముందుకు నడుపుతున్నారు. కానీ నిన్నటి ప్రోమోలు సుడిగాలి సుధీర్ టీం బయటికి వెళ్లి పోతున్నట్లు గా తెలియజేయడం జరిగింది.

అయితే దీంతో ఒక్కసారిగా అభిమానులంతా షాక్కు గురయ్యారు. తాజాగా ఈ రోజున అదిరే అభి కూడా జబర్దస్త్ షో కి గుడ్ బై చెపుతున్నట్లు గా సమాచారం. ఇక ఈయన ఎంతో మంది కమెడియన్ల కూడా జబర్దస్త్ షో కి పరిచయం చేయడం జరిగింది. తాజాగా ఒక ప్రముఖ ఛానల్లో కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాం లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గా సమాచారం. అయితే ఇలా వరుస పెట్టి వెళ్లిపోవడం వల్ల ఈశు ఉంటుందో లేదో తెలియడం లేదు.

Share.