JABARDASTH VINOD బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సైతం వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఇందులో గతంలో ఎక్కువగా లేడీ గెటప్స్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ బాగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో జబర్దస్త్ వినోద్ కూడా ఒకరు. తాజాగా తన భార్యతో కలిసి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వినోద్ మాట్లాడుతూ.. తన కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులను చూశాను ఎంతోమంది అవమానించారు.. అలాంటి సమయంలోనే తనకి హెల్త్ సమస్యలు వచ్చాయని దాని ద్వారా చాలా వీక్ అయ్యానని తెలియజేశారు వినోద్. అందుచేతనే చాలా తక్కువగా ఫుడ్ తింటున్నానని తెలియజేశారు. ఊపిరితిత్తుల్లో వాటర్ చేరుకుందని తెలియజేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే అభిమానులు సైతం కాస్త ఆశ్చర్యపోతున్నారు. ఇక వినోద్ (JABARDASTH VINOD) మాట్లాడుతూ ఈ సమస్య వచ్చిన సమయంలో తను నడవలేక పోయారని అందుచేతనే కొద్దికాలం జబర్దస్త్కు దూరంగా ఉన్నానని తెలిపారు.
తన ఫ్యామిలీ సపోర్టు లేకపోతే తను ఈ స్టేజిలో ఉండే వారిని కాదని తెలియజేశారు వినోద్. ఎక్కువగా ప్రయాణాలు చేయడం,బయట జంక్ ఫుడ్ తినడం వలన ఇలాంటి ఎక్కువగా వచ్చేందుకు ఆస్కారం ఉందని వైద్యులు తెలియజేసినట్లు తెలిపారు వినోద్. వినోద్ భార్య మాట్లాడుతూ తన భర్తకు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ సోకినప్పుడు చాలా బాధపడ్డానని తన ఆరోగ్య సమస్య గురించి చాలా చింతించానని తెలియజేసింది. అయితే తన భర్త త్వరగా కోలుకోవాలని అందుకు మెడిసిన్స్ వంటివి హెల్త్ చెకప్ వంటిది దగ్గరి నుంచి చేయించానని తెలియజేస్తోంది. అలా మెడికల్స్ వాడడం వల్ల తనకు హెయిర్ లాస్ అయిందని కూడా తెలియజేస్తుంది వినోద్ భార్య. ఈ విషయం తెలిసిన వినోద్ అభిమానులు కాస్త నిరుత్సాహ చెందుతున్నారు.