బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే జబర్దస్త్ షో ద్వారా చాలామంది సెటిల్ అయ్యారు.. అంతేకాకుండా ఆ షో ద్వారా చాలామంది బుల్లితెరకు పరిచయమయ్యారు. అందులో ఒకరు గడ్డం నవీన్ కూడ ఒకరు.ఈయన కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారు .జబర్దస్త్ కార్యక్రమంలోనే కాకుండా సినిమాల్లో కూడా ఎన్నో అవకాశాలను అందుకున్నారు గడ్డం నవీన్.. అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా గడ్డం నవీన్ మాట్లాడుతూ జబర్దస్త్ షోలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులు ఇప్పుడు లేరు.. ప్రస్తుతం వాళ్లు సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నారు. కొందరు డైరెక్టర్లు గా మారారు మరికొందరు హీరోలుగా కూడా మారి కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడిపేస్తున్నారు.
డైరెక్టర్ కావాలంటే ఎన్నో తెలివితేటలు ఉండాలి అందుకే నేను నిర్మాతగా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నానని తెలిపారు. నేను ఇండస్ట్రీలో ఎప్పటికైనా నిర్మాతగా మారి సినిమాలో చేయాలనేదే నా కోరిక అంతే కాకుండా సింగిల్ థియేటర్ నిర్మాణం చేపట్టడమే కళ అంటూ ఈ సందర్భంగా తెలిపారు గడ్డం నవీన్..అయితే నేను ఎన్ని సినిమాల్లో నటించి రానీ గుర్తింపు జబర్దస్త్ లో మాత్రమే వచ్చింది. అంతేకాకుండా జబర్దస్త్ షో కి మల్లెమాల కి ఎంతో రుణపడి ఉంటానని గడ్డం నవీన్ తెలియజేశారు.
ఇప్పుడు ఈయన చెప్పిన మాటలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ షో ద్వారా ఈయన మాత్రమే కాదు చాలామంది మంచి సక్సెస్ ని సాధించి వేరే లెవల్ లో ఉన్నారు.. మరి రాబోయే రోజుల్లో గడ్డం నవీన్ కూడా నిర్మాతగా హీరోగా మారి పలు సినిమాలలో నటిస్తారేమో చూడాలి మరి.