తెలుగు బుల్లితెరపై సీరియల్ నటి సోషల్ మీడియా స్టార్ గా పేరుపొందింది రీతూ చౌదరి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమధ్య హైపర్ ఆది స్కిట్లో చేసి బాగా పాపులర్ అయింది. మొదట్లో టిక్ టాక్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని షార్ట్ వీడియోలు కూడా చేసి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. అలా వెండితెర పైన కూడా సైడ్ ఆర్టిస్టులాగా బుల్లితెర పైన పలు సీరియల్స్ లో నటించింది.
బుల్లితెరపై గోరింటాకు సీరియల్ ద్వారా అడుగుపెట్టిన రీతూ చౌదరి తన నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత అమ్మకోసం ఇంటిగుట్టు అంటే సీరియల్స్ లో కూడా నటించింది. సీరియల్ నటిగా తనకు మంచి పేరు వచ్చిన తర్వాత జబర్దస్త్ లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది అలా పెళ్లిచూపులోనే జబర్దస్త్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు అక్కడే లేడీ కమెడియన్ సెటిల్ అయ్యింది. తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది.
ఇక జబర్దస్త్లో తోటి కమెడియన్స్ తో బాగా రచ్చ చేసిన రీతు చౌదరి ఒకవైపు సీరియల్స్ లో మరొకవైపు కమెడియన్ బిజీగా ఉండిపోయింది. ఇక సోషల్ మీడియాలో తన గ్లామర్ ట్రిటు ఇస్తూ అందరిని ఆకట్టుకుంది. సీరియల్ సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు తోటి మనోళ్ళతో రీల్స్ చేస్తూ సందడి చేస్తుంది. ఇక తన తండ్రిని కూడా సోషల్ మీడియా ప్రజలకు పరిచయం చేసింది ఇటీవల తన తండ్రి కూడా మరణించారు. ఈ బాధ నుంచి బయటపడడం కోసం పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా తన ఫాలోవర్స్ తో మరొకసారి ముచ్చటించింది వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపన్గా సమాధానం తెలిపింది. ఒక నిజం పెళ్లి మీద మీ ఒపీనియన్ చెప్పండి అని అడగగా.. చేసుకోకపోతే బెటర్ అంటూ సమాధానం తెలిపింది ప్రస్తుతం ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.