త్వరలోనే జబర్దస్త్ వర్ష పెళ్లి.. వీడియో వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడం వల్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తమ విషయాన్ని సైతం షేర్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు మాత్రం ఎలాంటి విషయం అయినా సరే అభిమానులతో పంచుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. ఒకప్పుడు తమ వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఇబ్బంది పడే సెలబ్రిటీలు సైతం ఇప్పుడు పూర్తిగా మారిపోయారని చెప్పవచ్చు. తమ ప్రేమ పెళ్లి విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగానే తెలియజేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.

Jabardasth Varsha Buys New Car Worth Of 20 Lakhs Become Talk Of The Town,  Know About Varsha Car | Jabardasth Varsha: కొత్త కారు కొన్న 'జబర్దస్త్'  వర్ష - రేటు ఎంతో తెలిస్తే షాక్ గ్యారెంటీ

తాజాగా మరొక బుల్లితెర ఆర్టిస్ట్ త్వరలోనే వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. తాజాగా మరొక వీడియో కూడా షేర్ చేయడం జరిగింది.ఇంతకు ఆమె ఎవరో కాదు జబర్దస్త్ వర్ష. పలు సీరియల్స్ లో నటించిన ఈమె సక్సెస్ కాలేకపోవడంతో జబర్దస్త్ లోకి గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడే ఫిక్స్ అవ్వడం జరిగింది. ఇక తన గ్లామర్ తో యువతను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే లేడీ కమెడియన్గా మంచి క్రేజీ సంపాదించుకుంది.

జబర్దస్త్ లో ఉండే మరొక కమెడియన్ తో కలిసి ఈమె చేసేటువంటి స్కిట్లు డైలాగులు కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈమె డాన్స్ కూడా అదిరిపోయేలా వేస్తూ ఉంటుంది. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా వర్ష తెగ సందడి చేస్తూ ఉంటుంది.సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్గానే ఉంటుంది వర్ష. తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ యువతను నిద్రపోనివ్వకుండా చేస్తుంది. పొట్టి పొట్టి బట్టలతో ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండే వర్ష గతంలో చాలా సార్లు ట్రోలింగ్ కూడా గురైంది. ఇక తాజాగా గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి ఈమె పెళ్లి కుదిరిందని ఆమధ్య ఎంగేజ్మెంట్ జరిగిందని తన యూట్యూబ్ ఛానల్స్ లో ఒక వీడియోని షేర్ చేసింది. ఇప్పుడు తాజాగా పెళ్లి బాగా మొదలయ్యింది అంటూ ఒక షాపింగ్ మాల్ లో చీరలు కొంటున్నట్లుగా కనిపిస్తోంది అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

Share.