జబర్దస్త్ కార్యక్రమంలో మొదటి సారిగా టీమ్ లీడర్ అయ్యింది జబర్దస్త్ రోహిణి. సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ బుల్లితెర నటి ఆ తర్వాత బిగ్ బాస్ షో తో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నది. స్టార్ మా లో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన రోహిణి అప్పుడప్పుడు మాత్రమే జబర్దస్త్ లో కనిపిస్తూ ఉండేది. ఈమె కామెడీ టైమింగ్ మరియు పంచ్ డైలాగులకి ప్రేక్షకులు ఫిదా అయ్యేవారు. ఏకంగా దీంతో మల్లెమాలవారు ఈమెకు టీమ్ లీడర్ అవకాశాన్ని కల్పించారు.
లేడీ టీమ్ లీడర్ ఎంత అంటూ కొంతమంది ఈమె పైన కోపంగా ఉండేవారట బుల్లితెర కమెడియన్స్. కానీ మొదట్లో కాస్త నిరాశపరిచిన ఆ తర్వాత పర్వాలేదు అనిపించింది రోహిణి ప్రస్తుతం జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ లో పలు టీం లీడర్లతో పోలిస్తే రోహిణి చాలా ఉత్తమంగా తన స్కిట్లు చేస్తుంది అంటూ మల్లెమాల సన్నిహితుల దగ్గర నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రోహిణి రెమ్యూనరేషన్ అత్యంత తక్కువ ఉండడం కారణం చేత ఈమెను జబర్దస్త్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈమె కూడా మంచి పాపులారిటీ కోసమే జబర్దస్త్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మల్లెమాలవారు కకృతితో కాస్ట్ కట్టింగ్ పేరుతో చాలామంది కంట్రీస్టెంట్లను వెనక్కి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైపర్ ఆది ,సుడిగాలి సుదీర్ వంటి వారిని ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకోవాలనే ఉద్దేశంతో మల్లెమాలవారు వారిని తొలగించాలనే వార్తలు వినిపిస్తూన్నాయి కానీ రోహిణి తక్కువ రెమ్యూనరేషన్ కి చేస్తుంది కనుక ఇలాంటి కమెడియన్లను సైతం కంటిన్యూ చేస్తున్నారని బుల్లితెర ప్రేక్షకులు అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది.