దారుణమైన స్థితిలో జబర్దస్త్ కమెడియన్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో ద్వారా చాలామంది జీవనాధారణ పొందారు. అంతేకాకుండా ఈ షో ద్వారా సినిమాలలో కూడా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వ్యక్తి పంచు ప్రసాద్. ఈయనకి ఇంతకుముందే ఒక కిడ్నీ పాడైపోయిందన్న విషయం తెలిసిందే.. అయితే అలాగే షోలలో నటిస్తూ నవ్విస్తూ ఉండే ఆయనకి మళ్లీ ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.Jabardasth Comedian Punch Prasad Latest photos - Sakshi

తన యూట్యూబ్ ఛానల్ లో పంచ్ ప్రసాద్ కు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేశారు. ఆరు నెలల్లో ప్రసాద్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరుగుతుందని ఆయన భార్య తెలిపారు. తాజాగా పంచు ప్రసాద్ మళ్లీ ఎం.ఆర్.ఐ స్కానింగ్ చేయించుకున్నారు. ఈ స్కానింగ్ నరకంలా ఉంటుందని 45 నిమిషాలు అందులోనే ఉండటం అంటే చాలా కష్టమని ప్రసాద్ వెల్లడించారు. టెస్టులు చేసేటప్పుడు తాను అరిచానని చాలామంది ప్రేక్షకుల కోరిక మేరకు ఈ వీడియోను షేర్ చేశామని పంచు ప్రసాద్ భార్య పేర్కొన్నారు.

పంచు ప్రసాద్ త్వరగా కోలుకొని సాధారణ మనిషి కావాలని యూట్యూబ్ ఛానల్ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతేకాకుండా పంచు ప్రసాద్ కి ఆర్థికంగా సహాయం చేస్తానని ఒకప్పుడు ఆర్పి ప్రకటించిన సంగతి తెలిసిందే.. అంతేకాకుండా జబర్దస్త్ కమెడియన్ లో సైతం ఆర్థికంగా తమ వంతు సాయం చేయించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పంచ్ ప్రసాద్ ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ఆయన సాధారణ మనిషి కావాలని ఫ్యాన్స్ దేవున్ని ప్రార్థిస్తున్నారు. అంతేకాకుండా పంచ్ ప్రసాద్ కొడుకు కూతురు వీడియోలో హైలెట్ గా నిలిచారు. వారి ముద్దు ముద్దు మాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏదేమైనా ఆయన కోలుకొని జబర్దస్త్ షో కి మళ్లీ తిరిగి రావాలని పంచు ప్రసాద్ కున్న కష్టాలన్నీ తొలగిపోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Share.