Janakiram..తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంత గుర్తింపు ఉందో చెప్పాల్సిన పనిలేదు.అలాంటి గుర్తింపు రావడానికి ముఖ్య కారణం స్వర్గీయ నటుడు రాజకీయవేత్త నందమూరి తారక రామారావు గారనీ చెప్పవచ్చు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ తరువాత బాలయ్య, హరికృష్ణ ,కళ్యాణ్ రామ్, తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ విషయం పక్కన పెడితే హరికృష్ణ లేటు వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
కానీ ఒక రోడ్డు ప్రమాదంలో చాలా ఘోరంగా మరణించారు హరికృష్ణ. హరికృష్ణ కు ముగ్గురు కుమారులు. ఒక కూతురు. ఇందులో చాలామందికి కళ్యాణ్ రామ్ ,జూనియర్ ఎన్టీఆర్ కూతురు సుహాసిని ఈ ముగ్గురు మాత్రమే తెలుసు.. అయితే హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ చాలామందికి తెలియకపోవచ్చు.. జానకిరామ్ చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు.అయితే ఆయన చనిపోక ముందే ఆయనకు వివాహమై ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు.
జానకిరామ్ చనిపోయాక ఆయన భార్య రెండో పెళ్లి చేసుకుంది అంటూ తాజాగా ఒక సీక్రెట్ బయటపడడం జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరాము భార్య పేరు దీపిక.. ఈమె భర్త చనిపోయాక దీపిక ఒంటరి అయిపోయింది. దీంతో తను ఇద్దరు పిల్లలను చూసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది ఆ సమయంలోనే హరికృష్ణ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట..
అదేమిటంటే తన ఇద్దరు మనవళ్ళు చిన్నపిల్లలు అవ్వడంతో పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత ఉండడంతో తన మనవళ్ళకి తండ్రి అవసరం అని భావించి హరికృష్ణ పెద్ద మనసు చేసుకొని తన పెద్ద కోడలు దీపికాకి రెండో వివాహం చేయడానికి సిద్ధపడ్డారట.. అయితే ముందుగా దీపిక ఈ వివాహానికి ఒప్పుకోలేదు.. కానీ నందమూరి కుటుంబం ఫోర్స్ చేయడంతో చేసేదేమీ లేక తన పిల్లల భవిష్యత్తు కోసం రెండవ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.