ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈయన దర్శకత్వం వహించిన చిత్రం రంగమార్తాండ సినిమా రిలీజ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొన్న కృష్ణవంశీకి ఒక నెటిజన్ రీ రిలీజ్ ట్రెండ్ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కృష్ణవంశీకి ఒక రిక్వెస్ట్ చేశాడు.. ” కృష్ణవంశీ గారు ఒక్కసారి మీ దర్శకత్వంలో వచ్చిన సింధూరం సినిమా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను.. ఆ సినిమాను మరోసారి థియేటర్స్ లో రిలీజ్ చేస్తే నాలుగు షోలు చూడడానికి నాలాంటి చాలామంది సిద్ధంగా ఉన్నారు.. సార్ దయచేసి నా ఈ అభ్యర్థనను మన్నించండి.. నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా సింధూరం.
నేను మృతి చెందేలోపు మరోసారి ఆ సినిమాను థియేటర్లో చూడాలి. ఆ సంగీతాన్ని వినాలి..” అంటూ ట్విట్టర్లో కృష్ణవంశీని టాగ్ చేస్తూ సదరు యూజర్ ట్వీట్ చేశాడు.. నెటిజన్ ట్వీట్ కి కృష్ణవంశీ బదులిస్తూ.. “అమ్మో ఆ సినిమా కారణంగా ఐదేళ్లు అప్పులు కట్టాను అయ్యా.. వామ్మో అంటూ దణ్ణం పెట్టేసాడు. సింధూరం సినిమా అప్పుల భారాన్ని తనపై వేసుకున్నట్టు” కృష్ణవంశీ తెలిపాడు. కృష్ణవంశీ చేసిన ఈ ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఇకపోతే నాగార్జునతో నిన్నే పెళ్ళాడుతా సినిమా తర్వాత కృష్ణవంశీ ఆంధ్ర టాకీస్ అనే పతాకంపై తొలి ప్రయత్నంగా సింధూరం చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించాడు.
పోలీస్ వర్సెస్ నక్సలిజం అంశంతో వచ్చిన ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. కానీ జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది ఈ సినిమా. అంతేకాదు నంది అవార్డు కూడా లభించింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. దీంతో కృష్ణవంశీ అప్పుల పాలయ్యారు. మొత్తానికి అయితే ఈ సినిమా రీ రిలీజ్ చేసే అవకాశాలు లేవని కూడా పరోక్షంగా స్పష్టం చేశారు కృష్ణవంశీ.
కృష్ణవంశీ గారు ఒక్కసారి సింధూరం సినిమా రిలీజైతే నా లాంటి చాలామంది4 షోస్ చూడటానికి సిద్ధంగా ఉన్నాము సార్…. దయచేసి ఈ మా ఆశ నెరవేర్చాలని కోరుతున్నాము సార్.."నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా సిందూరం"..మరణం లోపు మరల మరల చూడాలనిపించిన చిత్రం, వినాలి అనిపించే సంగీతం.@director_kv pic.twitter.com/dQPntTh47E
— Chandu Gummalla (@gummallachandu) January 3, 2023