అదే వేణుమాధవ్ ప్రాణం తీసింది అంటున్న వేణుమాధవ్ తల్లి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న కమెడియన్లలో వేణుమాధవ్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించిన వేణుమాధవ్ ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఆలీ వంటి స్టార్ కమెడియన్లు రాణిస్తున్న సమయంలోనే వాళ్లకి గట్టి పోటీ ఇచ్చారు వేణుమాధవ్. ఆ తర్వాత ఆయన అనారోగ్యం కారణంగా కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత 2019లో సెప్టెంబర్ 25న అనారోగ్యంతో కన్నుమూయడం జరిగింది.

Venu Madhav | వేణుమాధవ్‌కు 20 కోట్ల ఆస్తి ఉంది.. అయినా నేను అద్దె ఇంట్లోనే  ఉంటున్నా.. సంచలన విషయాలు చెప్పిన తల్లి సావిత్రమ్మ

ఎలాంటి కాంట్రవర్సీలకు దూరంగా ఉండే వేణుమాధవ్ చనిపోక ముందే ఆయన చనిపోయాడని పలు రూమర్సు వినిపించాయి. తాజాగా వేణుమాధవ్ తల్లి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. వేణుమాధవ్ తల్లి మాట్లాడుతు కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా వేణుమాధవ్ తల్లి అదే ఇంట్లోనే ఉంటున్నానని తెలియజేస్తోంది. తనకు ముగ్గురు కొడుకులని ..వేణుమాధవ్ చిన్న కొడుకు చిన్నప్పటినుంచి చాలా చురుకుగా ఉండేవారని తెలిపింది..ఈ క్రమంలోనే మిమిక్రీ చేస్తూ ఉండగా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి నిర్మాత అచ్చిరెడ్డి గారు వేణుమాధవ్ కు తమ సినిమాల్లో పిలిచే ఆఫర్ ఇచ్చారని తెలిపింది.

దీంతో వేణుమాధవ్ కు మంచి గుర్తింపు రావడానికి నటుడుగా మంచి పొజిషన్లో ఉన్నారని తెలిపారు. దీంతో తన ఇద్దరు కొడుకులను కూడా వేణుమాధవ్ కి అసిస్టెంట్ గా పెట్టానని తెలిపింది. వేణుమాధవ్ బాగా నటుడుగా ఎదిగారు కానీ తన ఇద్దరు కుమారులు మాత్రం ఎదగలేదని తెలిపింది. నేను చేసిన అతి పెద్ద తప్పు ఏమిటంటే వేణుమాధవ్ తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు ఎలాంటి వ్యాధి వచ్చినా కూడా మందులు వేసుకునేవారు కాదు అలాగే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు.. అదే అతని ప్రాణాలు తీసింది అంటూ తెలిపింది వేణుమాధ తల్లి.

Share.