ఇస్మార్ట్ శంకర్ కి కొత్త సమస్య

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మద్య ఏదైనా సినిమా హిట్ అయితే ఒకటీ రెండు రోజుల్లో ఏదో ఒక వివాదం చుట్టుముడుతున్నాయి. పైరసీ భారిన పడటమో.. కాపీ రైట్స్ ఇలా ఏదో ఒక విధంగా సమస్యలు వచ్చిపడుతున్నాయి. తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ సూపర్ హిట్ టాక్ సంపాదించి మంచి కలెక్షన్లు వసూళ్లు చేస్తుంది. అయితే ఈ మూవీ హాట్ అయ్యిందన్న ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్ కి షాక్ ఇస్తూ ఆనందం ఫేమ్ ఆకాష్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.

ఇస్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ తనదేనంటూ హీరో ఆకాష్ (ఆనందం ఫేం) తమిళ నిర్మాత మండలిలో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి మెదడును హీరోకి మార్చే కాన్సెప్ట్‌తో తెలుగు–తమిళ భాషల్లో లేడీ డైరెక్టర్‌ రాధ నాతో సినిమా తీశారు. ‘నాన్‌ యార్‌’ పేరుతో తమిళ చిత్రం విడుదల కాగా, ‘కొత్తగా ఉన్నాడు’ పేరుతో త్వరలో తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

ఇంతలోనే ఇస్మార్ట్ శంకర్ మూవీ చూసి షాక్ అయ్యానని..తన మూవీ కాన్సెప్ట్ కాపీ చేయడం ఎంత వరకు న్యాయం అని ఆయన అన్నారు. ఈ విషయంపై తమిళనాడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో ఆకాష్ చెప్పారు. ఇక్కడ తనకున్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు.

Share.