రామ్ హీరోగా క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. గురువారం రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సంపాదించింది. పూరి టేకింగ్, రాం యాక్టింగ్, హీరోయిన్స్ గ్లామర్ షో ఇలా అన్ని సినిమాకు బాగా కలిసి వచ్చాయి. ముఖ్యంగా రాం నటనతో పాటుగా పూరి డైలాగ్స్ సినిమాలో ఆడియెన్స్ ను ఎక్కువగా అలరిస్తున్నాయి.
ఇక ఈ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఇస్మార్ట్ శంకర్ 7.83 కోట్లు వసూళు చేసినట్టు తెలుస్తుంది. ఓవర్సీస్ లో ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ డే కలక్షన్స్ ఎలా ఉన్నాయో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వరుస ఫ్లాపులతో ఉన్న పూరి ఇస్మార్ట్ శంకర్ తో స్మార్ట్ హిట్ కొట్టాడని చెప్పొచ్చు.
ఏరియా వైజ్ గా ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూస్తే..
నైజాం : 3.43 కోట్లు
సీడెడ్ : 1.20 కోట్లు
వైజాగ్ : 0.86 కోట్లు
ఈస్ట్ : 0.50 కోట్లు
వెస్ట్ : 0.40 కోట్లు
కృష్ణ : 0.53 కోట్లు
గుంటూరు : 0.57 కోట్లు
నెల్లూరు : 0.30 కోట్లు
ఏపీ/తెలంగాణ : 7.83 కోట్లు