కాంతారా-2లో జరగబోయేది ఇదేనా.. నిజమైతే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిత్రం కాంతారా.ఈ సినిమాని డైరెక్టర్ హీరో, రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా చూసిన అభిమానుల సైతం ఈ సినిమా సీక్వెల్ ఉండబోతోంది అన్నట్లుగా కామెంట్లు చేశారు.అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా గురించి పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కేవలం రూ.16 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కించగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లో రాబట్టినట్లు తెలుస్తోంది.

Panjurli Daiva 'Warns' Rishab Shetty before Kantara 2, here's what he was  'Advised' - MetroSaga

దీంతో ఈ సినిమా బ్యానర్ నిర్మించిన హోం భలే ఫిలిం వ్యవస్థపకుడు విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. కాంతారా సినిమా హిట్ చాల ఆనందాన్ని కలిగించిందని.. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ కూడా నిర్మిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారని దీనికోసం కొంతకాలం వేచి ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. కాంతారా 2 లో కూడా ఆచారాలు నమ్మకాలు అనే బేస్ లోనే ఉంటుందని కాంతార మొదటి భాగం కంటే ఎక్కువగా మెప్పించగలిగే బలమైన కథతో రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రిషబ్ శెట్టి ఈ సినిమా తీసే సమయంలో ఎలాంటి ప్లానింగ్ లేదని అనుకోకుండా ఆ కథ ఎంచుకొని సరికొత్తగా రూపొందించారని ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యిందని తెలిపారు. అయితే కాంతారా లో శివ తండ్రి గురించి పెద్దగా చెప్పలేదు కానీ కాంతారా-2 లో శివ తండ్రి భూతకొలను నర్తకి గా మారే ఆధ్యాత్మిక పాత్రపై దృష్టి పెట్టి అవకాశం ఉందని అంతేకాకుండా ఆస్కార్ కోసం ఈ చిత్రాన్ని దరఖాస్తు చేశామని ఈ సినిమా కథ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇదే లెవెల్ లోనే ఈ సినిమా ఉండబోతుందని విజయ్ కిరగందూర్ తెలియజేశారు.

Share.