పవన్ కళ్యాణ్ తాబేలు ఉంగరం పెట్టుకోవడం వెనుక అసలు కారణం ఇదేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఒకపక్క సినిమాలలో బిజీగా ఉంటూనే మరొక పక్క రాజకీయాలలో కూడా మరింత వేగంగా దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆయన చేతులు గనుక మనం గమనించినట్లయితే ఆయన కుడి చేతికి తాబేలు ఉన్న ఉంగరం ఉంటుంది. అయితే దీనిని ధరించడం వెనుక పెద్ద కథ ఉందని చెబుతున్నారు సన్నిహితులు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతికి కొత్తగా తాబేలు ఉంగరం, దేనికోసం  పెట్టుకున్నారో తెలుసా..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం తన జనసేన పార్టీని పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల పార్టీకి , ఆయనకు ఈ సమయం కీలకం కావడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ముందుకు వెళుతున్నారు. ఒకవైపు షూటింగ్ లు చేస్తూనే మరొకవైపు ప్రజా పర్యటనలు చేస్తున్నారు. 2019తో పోల్చుకుంటే ఇప్పుడు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రజలు కూడా పవన్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఒకసారి అవకాశం ఇస్తే తెలుస్తుంది కదా ఆయన పరిపాలన ఏంటో అంటూ చెబుతున్నారు. అందుకే ఈసారి ఎలాగైనా కచ్చితంగా విజయం సాధించాలన్న పట్టుదలతో జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టాడు. బంగారంతో తయారుచేసిన తాబేలు ఉంగరాన్ని ఆయన తన కుడి చేతికి పెట్టుకున్నారు.

దీని వెనుక అర్థం ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రంలో తాబేలు ఉంగరం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. హిందూ ధర్మం ప్రకారం తాబేలు మహావిష్ణువు అవతారాలలో ఒకటి. క్షీరసాగర మదన సమయంలో విష్ణువు ఈ అవతారాన్ని ధరించారు. అందుకే ఈ ఉంగరం ధరించడం వల్ల పాజిటివ్ శక్తి వస్తుందట. ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. అన్ని రాశుల వారు ఉంగరాన్ని ధరించడానికి లేదు.. కేవలం కొన్ని రాశుల వారు మాత్రమే ధరించాలి..కుబేరుడి వాహనం కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడేవారు ఈ ఉంగరాన్ని పెట్టుకుంటే మంచి లాభాలను పొందుతారు. ఆర్థికంగా తాను ఎంచుకున్న రాజకీయ పార్టీలో సక్సెస్ అవ్వడానికి ఆయన ఈ విధంగా ఉంగరం ధరించినట్లు సమాచారం.

Share.