సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సెలబ్రిటీలు మధ్య పలు రూమర్సు వినిపిస్తూనే ఉంటాయి. ఇంకా డేటింగ్ వార్తలు కూడా తరచూ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.నిత్యం ఏదో ఒక సెలబ్రిటీల గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయని చెప్పవచ్చు. నటీనటులు సైతం కాస్త చనువుగా కనిపించారంటే చాలు ఆ సెలబ్రిటీల మధ్య ఏదో నడుస్తోందనే వార్తలను వైరల్ గా చేస్తూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటుల పై పలు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలోనే నాలుగైదు రోజులగా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన పూజా హెగ్డే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నారని వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ స్నేహితుడు కూడా స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.
ఇటీవలే బిగ్ బాస్ మాజీ కంటిస్టెంట్ కమల్ రషీద్ ఖాన్ వీరి పైన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో సల్మాన్ అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యపోయారు. పూజా హెగ్డే అభిమానులు మాత్రం మా హీరోయిన్ కి సల్మాన్ ఖాన్ ను అంటగట్టారేంటి అంటూ మండిపడుతున్నారు. తాజాగా ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ స్నేహితురాలు ఒకరు స్పందించినట్లుగా సమాచారం. సల్మాన్ ఖాన్ స్నేహితుడు సోషల్ మీడియాలో వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ.. ఇలాంటి బాధ్యతారహితమైన వార్తలు వ్యాప్తి చేసే వారికి కనీసం సిగ్గు ఉండాలి అంటూ తెలియజేస్తున్నారు.
పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ కు ఒక కూతురు లాంటిది. వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తే వారికి ఇలాంటి రూమర్ అంట కడతారా అంటూ కొంతమంది మూర్ఖులు పబ్లిసిటీ వస్తుందని ఆలోచనతోనే ఇలాంటి పనులు చేస్తున్నారని వారిపై ఫైర్ అయ్యారు. కానీ ఈ విషయం మాత్రం చాలా ఇబ్బందికరమైన విషయం అంటూ తీవ్రస్థాయిలో మండిపడడం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ ,పూజా హెగ్డే ప్రస్తుతం కీసి కా భాయ్ కిసి కి జాన్ వంటి సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే పూజా హెగ్డే పుట్టినరోజుని అక్కడే చాలా ఘనంగా జరుపుకుంది దీంతో వీరి పైన పలు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఎట్టకేలకు ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ స్నేహితుడు క్లారిటీ ఇవ్వడంతో కాస్త అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.