టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన సమంత గత కొన్ని నెలలుగా మాయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసింది. ఈ విషయాన్ని ఇమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది.దీంతో ఆరోగ్య సమస్యలపై పలు రకాలుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల సమంత ఆరోగ్యం క్షీణించింది అంటూ మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అదంతా ఏమీ లేదంటూ సమంత కుటుంబ సభ్యులతో పాటు సమంత టీం కూడా స్పందించింది.
మయో సైటీస్ వ్యాధి కారణంగా సమంత అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.ఆ తర్వాత ఇదే చికిత్స ఇండియాలో కూడా కంటిన్యూ చేస్తోంది. అయితే ఇంగ్లీష్ మెడిసిన్ తో ఈ వ్యాధి నయం కాకపోవడంతో సమంత తన ఆరోగ్యం కోసం కేరళకు వెళ్లిందనే వార్తలు వినిపించాయి.అక్కడ ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా సమంత సినిమాల విషయంలో పలు కీలక నిర్ణయం తీసుకుందనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ చేసిన సమంత హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు అన్నీ కూడా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయి.
దీంతో సమంత ఈ నిర్ణయం తీసుకోలేక తప్పదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఖుషి సినిమాను పూర్తి చేసి సమంత సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మాయాసైటిస్ బారిన పడి ఆ వ్యాధితో పోరాడుతున్న ఎక్కువ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆమె సైన్ చేసిన సినిమాల నుంచి తొలగిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఖుషి సినిమా షూటింగ్ చివరి దశలో ఉండడంతో ఈ సినిమాను మాత్రమే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. కానీ అభిమానులు మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి