గోపీచంద్ గొప్పవాడు అనడానికి ఇది చాలదా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ తెలుగు దర్శకుడు టి.కృష్ణ ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు కలిగిన దర్శకుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు అంతకుమించి మంచి మనసున్న వ్యక్తి కూడా.. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ఆయన తీసిన సినిమాలను బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. టి కృష్ణ అకాల మరణం ఆయన కొడుకులకు కొంత శాపమని చెప్పాలి. టి. కృష్ణ గారు బ్రతికి ఉంటే కచ్చితంగా ఆయన ఇద్దరి కొడుకులలో ఒకరు కచ్చితంగా గొప్ప దర్శకుడిగా, మరొకరు గొప్ప హీరోగా ఎదగడం ఆయన చూసేవారు. కానీ ఆయన ఆకస్మిక మరణం చెందడం ఆ కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పోవడం అన్ని జరిగిపోయాయి.Gopichand to call it 'Seetimaar'?కేవలం ఏడు సినిమాలు మాత్రమే తీసిన ఆయనను ఇంకా ఇండస్ట్రీ గుర్తుపెట్టుకుంది అంటే ఆయన ఎలాంటి ఆణిముత్యాల లాంటి సినిమాలను తెరకేక్కించారో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్ లేడీ అమితాబ్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతితో ఈయనకు మంచి అనుబంధం ఉండేది. ఆమెతోనే ఎక్కువ సినిమాలు తెరకెక్కించారు టి.కృష్ణ గారు.. ఆయన పెద్ద కొడుకు ప్రేమ్ చంద్ తండ్రి లాగే సినిమాలకు దర్శకత్వం వహించాలని అనుకున్నారు. కానీ మొదటి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో 1995 కారు ప్రమాదంలో కన్నుమూశారు.

కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులను కోల్పోయిన గోపీచంద్ కుటుంబం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అన్నను కోల్పోయిన గోపీచంద్ ఆరేళ్లకు తొలిసారి స్క్రీన్ పై హీరోగా నటించాడు. గోపీచంద్ తన తండ్రి లాగే మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి.. గోపీచంద్ చెన్నైలోని కొంతమంది అనాధలను చేరదీసి వారికి ఫ్రీగా విద్యను అందిస్తున్నారు. అయితే ఎందుకో మరి దానిని బయటకు చెప్పుకోవడం లేదు. అయితే ఇదే విషయాన్ని గోపీచంద్ ను ప్రశ్నించగా మనం చేసే పనిలో మంచి కనపడాలి కాని.. మనిషి కాదు అంటూ సింపుల్ గా చెప్పేశారు గోపీచంద్ . దీన్ని బట్టి చూస్తే ఎంతైనా ఆ గొప్ప తండ్రికి పుట్టిన కొడుకే కదా ఇంత గొప్పగా ఉంటాడు.. అంటూ ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Share.